వైయస్ జగన్ మనిషిని కాబట్టే నన్ను తొలగించారు: కుసుమ


అనంతపురం: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మనిషిని కాబట్టే కనీసం సమాధానం ఇచ్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా తనను తొలగించారని ఉద్వాసనకు గురైన శ్రీకృష్ణదేవరాయల విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ కుసుమ కుమారి ఆరోపించారు. రాజకీయంగా తాను వైయస్ రాజశేఖర రెడ్డి వర్గానికి చెందినదాన్ననని ఆమె చెప్పుకున్నారు. అందుకే రాత్రికి రాత్రే తనను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఆమె విమర్శించారు. నియామకాల్లో అవకతవకలు అసలు జరగనేలేదని, అన్నీ చట్ట ప్రకారమే జరిగాయని ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తనకు పదవి రావడంలోకూడా రాజకీయ నేపథ్యమే ఉందని, ఇది రాజశేఖర రెడ్డి ఇచ్చిన పదవిగానే ఆమె వెల్లడించారు. విద్యార్హతలతో పాటు విసి అపాయింట్‌మెంట్లలో రాజకీయ కారణాలే ఉంటాయని, ఇది ఎవరికీ తెలియనిదేమీ కాదని కూడా ఆమె చెప్పారు. తన ఉద్వాసను హైకోర్టులో సవాల్ చేస్తానని ఆమె చెప్పారు.అసలు ప్రభుత్వం అనేది ఉందా అని ఆమె ఆశ్చర్యం, ఆవేదన వ్యక్తంచేశారు. ఒక విసిగా రాజకీయాల గురించి మాట్లాడవచ్చా అని ప్రశ్నించగా అసలు తాను ఈ పదవిలోకి వచ్చిందే రాజకీయ కారణంగానని ఆమె చెప్పారు. ఎక్కడైనా విసి నియామకంలో రాజకీయ కోణం ఉంటుందని మరో ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు. విసిగా తాను వైయస్ ప్రయోజనాలు కాపాడానని కూడా ఆమె వెల్లడించారు. వైఎస్ సామాజిక న్యాయం అనేవారని, అందుకే తాను మొత్తం 21 నియామకాలలో 16 మంది నిమ్నవర్గాలకు అవవకాశం కల్పించానని ఆమె చెప్పారు. తన భర్త భూమన్ తెలంగాణా వాది అని, తన మరిది భూమన కరుణాకర రెడ్డి ప్రస్తుతం జగన్‌తో పాటు ఓదార్పుయాత్రలో చురుకుగా పాల్గొంటున్నారని, ఈ రాజకీయ కారణాలవల్లే తనపై వేటు వేశారని ఆమె వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం కావాలని తనపై దాడి చేసిందని భావిస్తున్నట్టు ఆమె చెప్పారు.

www.123tollywoodcinemalu.blogspot.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.

0 Responses to "వైయస్ జగన్ మనిషిని కాబట్టే నన్ను తొలగించారు: కుసుమ"

Leave a Reply