కాంగ్రెస్ అధిష్ఠానం మద్దతుతోనే జగన్‌పై చిరు ఎటాక్
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి, కడప ఎంపీ, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు జగన్‌పై విమర్శల చేయడానికి కాంగ్రెస్ అధిష్టానమే కారణమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్‌కు ప్రాధాన్యం లేకుండా చేయడానికే చిరంజీవిని అధిష్టానం రంగంలోకి దించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కోట్లు సంపాదించుకునే సినిమా రంగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో ప్రస్తుతం ఆచితూచి అడుగులేస్తున్న చిరంజీవి జగన్‌మీద డైనమిక్‌గా విమర్శలు గుప్పించడానికి అధిష్టానమే కారణమని టాక్. ఎన్నికల ఫలితాలు నిరుత్సాహం కలిగించడంతో ఏం చేయాలనే ఆలోచిస్తున్న చిరును కాంగ్రెస్ చేరదీసి, జగన్‌పై యుద్ధం చేయమని బరిలోకి దింపినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.ఇప్పటికే అధిష్టానం దృష్టిలో మాట వినడని ముద్ర వేసుకున్న జగన్ మొదట సీఎం రోశయ్య మీద మాటల యుద్ధం ప్రకటించినప్పటికీ ప్రస్తుతం చిరంజీవిని ఢీకొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ జగన్ వర్గం మాత్రం చిరంజీవి విమర్శలపై మండిపడుతోంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి రావడానికి కారకులైన వైఎస్సార్ సేవలను మరిచిపోవడమే కాక ఆయన వారసుడు జగన్‌ను పక్కనబెట్టి, చిరంజీవిని చేరదీయడంపై జగన్ వర్గం ఆవేశంతో రగిలిపోతోంది.
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి, ఎంపీ జగన్‌లపై అసత్యపు ఆరోపణలు చేస్తే ప్రజలే మీ నాలుకలు కోస్తారని అంబటి రాంబాబు చిరు వర్గాన్ని హెచ్చరించడంతో మాటల యుద్ధం తారాస్థాయికి వెళ్లినట్లయింది.
www.Teluguveera.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.