రంజాన్‌ దీక్షలు ప్రారంభం


ఇస్లామిక్‌ క్యాలెండర్‌లో తొమ్మిదో మాసమైన రంజాన్‌ ముస్లీం సోదరులకు అత్యంత పవిత్రమైనది. ఈ నెల్లాళ్లు ముస్లీంలు కఠోర ఉపవాస దీక్షలు చేసి...చివరగా ఈద్‌ పర్వదినం రోజున పేదసాదలకు దాన ధర్మాలు చేస్తారు. ఆకాశంలో నెలవంక కనిపించడంతో రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభం అవుతున్నాయని రువాయత్‌ హిలాల్‌ అనే ముస్లీం మతసంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్ని మసీదుల్లో గత రాత్రి నుంచే తరావీ నమాజ్‌ ప్రారంభమైంది. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో అసంఖ్యాకంగా ముస్లీం సోదరులు పాల్గొన్నారు. రంజాన్‌ మాసం ముస్లీంలకు అతి పవిత్రమైన మాసం. ఇస్లామిక్‌ క్యాలెండర్లో తొమ్మిదో నెల అయిన రంజాన్‌ ఉపవాస దీక్షలను ప్రపంచ వ్యాప్తంగా ముస్లీం సోదరులు భక్తిశ్రద్దలతో నిర్వహిస్తారు.

ఆకాశంలో నెలవంక కనిపించడంతో గురువారం ఉదయం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం అవుతాయని రువాయత్‌ హిలాల్‌ కమిటీ ప్రకటించింది. ఢిల్లీలోని జామా మసీద్‌ ఇమాం సయ్యద్‌ అహ్మద్‌ బుఖారీ కూడా దేశవ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచి దీక్షలు ఆరంభం అవుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మసీదుల్లో గత రాత్రి నుంచే తరావీ నమాజ్‌లు ప్రారంభం అయ్యాయి. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో అసంఖ్యాకంగా ముస్లీంలు పాల్గొన్నారు. దీంతో మసీదులన్నీ నూతన శోభతో కళకళలాడుతున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో బుధవారం నుంచే రంజాన్‌ మాసం ప్రారంభం అయ్యింది.

ఈ నెల రోజులు రెస్టారెంట్లలో తినరాదని, మద్యాపానం, ధూమపానం చేయరాదని గల్ఫ్‌దేశాల మత పెద్దలు చెప్పారు. ఈ నియమాలు అతిక్రమిస్తే కఠినమైన శిక్షలు ఎదుర్కొవల్సి వస్తుందని చెప్పారు. దీక్షల అనంతరం ఈద్‌ పర్వదినం రోజున పేదసాదలకు విశేషరీతిలో దాన ధర్మాలు చేయాలని తెలిపారు. రంజాన్‌ పర్వదినాల్లో హలీంకు ప్రత్యేక స్థానం వుంది. ఈ నెల రోజులు ఉపవాస అనంతరం బలవర్థక ఆహారమైన హలీంను భుజించి..ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు.

www.Teluguveera.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.

0 Responses to "రంజాన్‌ దీక్షలు ప్రారంభం"

Leave a Reply