ట్రాయ్ ప్రతిపాదనపై ప్రసార - డిటిహెచ్ సంస్థల సిగపట్లు
డైరెక్ట్-టు-హౌమ్ (డిటిహెచ్) ఆపరేటర్ల నుండి ప్రసార సంస్థలు వసూలు చేయాల్సిన హౌల్‌సేల్ రేటు పరిమితిని తగ్గిస్తూ టెలికామ్ నియంత్రణా సంస్థ (ట్రాయి) సిఫార్సు చేయడం ప్రసార సంస్థలు-డిటిహెచ్ ఆపరేటర్ల మధ్య వివాదానికి దారితీసింది. టాటా స్కై సిఇఒ విక్రమ్ కౌశిక్ మాట్లాడుతూ ట్రారు చేసిన సిఫార్సు సరైన మార్గంలో వేసిన తొలి అడుగువంటిదని, యీ చర్య ద్వారా 50 శాతంగా వున్న పరిమితి 35 శాతానికి తగ్గడానికి సాధ్యపడిందని అన్నారు. ప్రసార సంస్థలు తమ చానెళ్ళను ప్రసారం చేసినందుకు గాను కేబుల్ టివి ఆపరేటర్ల నుండి వసూలు చేస్తున్న రుసుములో కేవలం 35 శాతం మాత్రమే డిటిహెచ్ ఆపరేటర్ల నుండి వసూలు చేయాలని ట్రారు సిఫార్సు చేసింది. వేరు వేరు ఛానెళ్ళను ఎంపిక చేసుకోవడంలో వినియోగదారుల ఐచ్ఛికాలకు సంబంధించిన రికార్డును డిటిహెచ్ ఆపరేటర్ళు ఖచ్ఛితంగా నిర్వహిస్తారని, కేబుల్ టివి విషయంలో యిందుకు సంబంధించిన వివరాల కోసం ఆ యా కేబుల్ టివి ఆపరేటర్లు అందించే గణాంకాలపైనా ప్రసార సంస్థలు ఆధారపడవలసి వుంటుంది. ఎయిర్‌టెల్ డిటిహెచ్ సర్వీసెస్ సిఇఒ పూరి మాట్లాడుతూ తమ ఖాతాదారుల విషయంలో కేబుల్ ఆపరేటర్లు యిస్తున్న నివేదిక పట్ల ట్రారు ఆందోళనను యీ సిఫార్సు ద్వారా వెలుగులోకి తీసుకువచ్చినట్లయిందని అన్నారు. కేబుల్ ఆపరేటర్లు, డిటిహెచ్ కంపెనీలు ప్రసార సంస్థలకు చెల్లిస్తున్న ధరల్లో వ్యత్యాసాన్ని ఈ చర్య ద్వారా తగ్గించడానికి యీ చర్య దోహదం చేస్తుందని ఆయన అన్నారు. అయితే ట్రాయి చేసిన యీ సిఫార్సు పట్ల ప్రసార సంస్థలు మండిపడుతున్నాయి. డిటిహెచ్ కంపెనీల నుండి తమకు వచ్చే ఆదాయాన్ని యిది తగ్గిస్తుందని ప్రసార సంస్థలు వాదిస్తున్నాయి. స్టార్ ఇండియా అధిపతి ఉదరు శంకర్ మాట్లాడుతూ 35 శాతంలో వున్న లాజిక్ ఏమిటి అని ప్రశ్నిస్తూ, యిది పూర్తిగా లాటరీ పద్ధతిలో లెక్కించినదని వ్యాఖ్యానించారు. ఈ సిఫార్సులను తాము అంగీకరించడం లేదని, యిది తమకు దిగ్భ్రమకలిగించిందని అన్నారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ భారతీయ ప్రసార సంస్థల సమాఖ్య నిరసన వ్యక్తంచేస్తుందని ఆయన అన్నారు. కాగా ప్రసార సంస్థలకు కేబుల్ పరిశ్రమ అందిస్తున్న ఆదాయంతో సమానంగానే డిటిహెచ్ కంపెనీల నుండి కూడ ఆదాయం లభిస్తోందని ఈ వాస్తవాన్ని ప్రసార సంస్థలు కావాలనే దాచిపెడుతున్నాయని డిటిహెచ్ కంపెనీలు అంటున్నాయి. 'స్వల్పకాలిక లాభాలవైపే ప్రసార సంస్థలు దృష్టిపెడుతూ, ట్రాయి సిఫార్సుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ, బంగారు బాతును వారు చంపుకునేందుకు సిద్ధపడుతున్నారు' అని పూరి వ్యాఖ్యానించారు. ఇలా వుండగా ట్రారు సిఫార్సును వ్యతిరేకించేందుకు ప్రసార సంస్థలు నడుంకట్టాయి.'ఇప్పటికే రిటైలు రేట్లు అట్టడుగుకు చేరాయి. ధరల విషయంలో 50 శాతం నుండి 35 శాతానికి తగ్గించేందుకు డిటిహెచ్ ఆపరేటర్లకు అవకాశం యివ్వడం వలన వినియోగదారులకు ప్రయోజనం ఎటువంటి కలిగించకుండానే ఆపరేటర్ల లాభాల మార్జిన్లను పెంచుకోవడానికి కారణమవుతుంది. ఇది ప్రసార సంస్థల భారాన్ని ఏమాత్రం తగ్గించబోదు' అని ప్రసార సంస్థలు వాదిస్తున్నాయి.
www.123tollywoodcinemalu.blogspot.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.