Story of Komaram Puli (Telugu)
దేశంలో అరాచకం అణుద్దామని ప్రయత్నించిన ప్రతీసారీ రాజకీయనాయకుల వల్ల మిగతా వారి వల్ల సమస్యలు వస్తున్నాయని అందుకే తనకు ప్రత్యేకమైన అథికారాలు ఇస్తే ఏదైనా చెయ్యగలను అంటాడు. అప్పుడాయన ఓ.కె అంటాడు. అక్కడ నుండి పవన్ పులి టీమ్ అని ఏర్పాటు చేసి మాటు వేసిన చిరుతపులిలా సంఘవ్యతిరేక శక్తులను చీల్చిచెండాడుతూంటాడు. అయితే చివరకు అతనికో నిజం తెలుస్తుంది.
అది ప్రధానమంత్రి కూడా ఆ విలన్స్ తో చేతులు కలిపాడని. అంతే ఆయనకు ఎదురుతిర్గుతాడు. అక్కడనుండి హోరో హీరీ పోరాటం జరిగి గెలిచి అందరి మన్ననలూ పొందుతాడు. ఇక హీరోయిన్ కూడా పోలీస్ డిపార్టెమెంట్ లోనే ఉంటుంది. ఎప్పుడూ ఇంట్రావర్ట్ గా ఉండే అతన్ని సరదాగా ఉండే మనిషిని చేసి కర్తవ్యోన్ముఖురాలిని చేస్తుంది. క్లైమాక్స్*కి ముందే హీరోయిన్* నిఖేషా పటేల్* విలన్స్* చేతిలో చనిపోతుందట. అలాగే హీరోకి చిన్నప్పుడు వచ్చి ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా ఆర్ద్రంగా ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారంలో ఉన్న ఈ కథ కరెక్టే అవటానికి ఎంత అవకాశం ఉందో కాకపోవటానికి కూడా అంతే అవకాశముంది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఎఆర్ రహమాన్ సంగీతం అందించారు. రీసెంట్ గా ఆడియో రిలీజైన ఈ చిత్రాన్ని శింగనమల రమేష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు
www.Teluguveera.com is not responsible for the accuracy, compliance, copyright, legality,decency, or any other aspect of the content of other linked sites.Sometimes we post the links from other sites that are on the Internet.