లక్ష్మణుడికి కోపం వచ్చింది.. ఎందుకో?
ఎప్పుడూ కూల్‌గా.. ఏమాత్రం టెన్షన్ పడకుండా.. స్వేచ్ఛగా క్రికెట్‌ను ఆస్వాదించే వీవీఎస్ లక్ష్మణ్.. ఈ సారి మాత్రం పూర్తి డిఫరెంట్‌గా కనిపించాడు. టీం ఇండియాకు విజయం అందించడం కోసం చాలా టెన్షన్ పడ్డాడు. చివరివరకూ పోరాడాడు. అపూర్వ విజయాన్ని భారత్‌కు అందించాడు. అయితే.. ఎప్పుడూ చూడనంత ఉగ్రలక్ష్మణుడు ఈ మ్యాచ్‌లో కనిపించాడు.క్రీజ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత తన ఆట తాను ఆడుకోవడమే లక్ష్మణ్‌కు తెలుసు. కానీ, ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ టెస్ట్ లాస్ట్ ఇన్నింగ్స్‌లో మాత్రం అందరికీ మరో లక్ష్మణ్ కనిపించాడు. ఓ వైపు ఎక్కడ వికెట్ పడుతుందోనన్న టెన్షన్.. మరో వైపు ఎలాగైనా విజయం సాధించాలన్న ప్రెజర్.. ఈ రెండూ లక్ష్మణ్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపించాయి. అందుకే, అవకాశం ఉన్నప్పుడు ఒక్క పరుగునూ వదులుకోవడానికి ఇష్టపడలేదు. సింగిల్ తీసే అవకాశం ఉన్నా, దిక్కులు చూస్తున్న ఇషాంత్‌పై బాగో అంటూ విరుచుకుపడ్డాడు..
మన ఓజానైతే కొట్టినంత పనిచేశాడు లక్ష్మణ్. క్రీజ్‌లో కదలకపోవడంపై సీరియస్ అయ్యాడు. బ్యాట్ ఎత్తి కొట్టినంత పని చేశాడు. మరో ఆరు పరుగులు చేస్తే టీం ఇండియాకు విజయం దక్కుతుందనుకున్న సమయంలో ఆట ముగిసిపోయిందనిపించింది. ఓజా బ్యాటింగ్.. జాన్సన్ బౌలింగ్. ఎల్‌బీడబ్ల్యూకు అప్పీల్.. అందరిలోనూ టెన్షన్. పరుగుకోసం ఓజా ప్రయత్నించడం.. లక్ష్మణ్‌కు బైరన్నర్‌గా ఉన్న రైనా వద్దనడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈలోగా నార్త్ వేసిన త్రో వికెట్ల పక్కనుంచి వెళ్లిపోయింది. ఒకవేళ వికెట్లకు తగిలిఉంటే ఆట ముగిసిపోయేది. ఇదంతా చూస్తున్న లక్ష్మణ్‌లో టెన్షన్. నార్త్ వేసిన బాల్ బౌండరీని తాకడంతో.. నాలుగు పరుగులు అదనంగా వచ్చి చేరాయి. దీంతో.. లక్ష్మణ్‌లో మళ్లీ రిలీఫ్..
విజయానికి అవసరమైన రెండు పరుగులూ రావడంతో.. ఒక్కసారిగా పండగ వాతావరణం. స్టేడియంలో సంబరాలు. ఎంతటి విజయం దక్కినా చిరునవ్వుతో పెవిలియన్‌కు వచ్చే లక్ష్మణ్... ఈసారి మాత్రం ఎగిరి గంతేశాడు. తన ఆనందాన్ని కొలీగ్స్‌తో పంచుకున్నాడు.
ఇలా ఎన్నో రకాల హావభావాలను మొహాలీ టెస్ట్‌లో పలికించాడు లక్ష్మణ్. అయితే.. ఇదంతా విజయం కోసం అతను పడిన తపనలోనుంచి వచ్చినవే. ఓ వైపు వెన్నునొప్పి బాధిస్తున్నా... రికీ సేనకు విజయాన్ని దూరం చేశాడు. ఆసీస్‌పై తన రికార్డును కొనసాగించాడు. మొహాలీలో ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని భారత్‌కు అందించాడు.
