'ఇటియట్ 2' లో హీరో గా బంపర్ ఆఫర్ ఎవరికి..?
రవితేజ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇడియట్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ చేసే ప్రయత్నంలో పూరీ ఉన్నాడని తెలుస్తోంది. తన తమ్ముడు సాయిరామ్ శంకర్ ని హీరోగా నిలబెట్టడానికే పూరీ ‘ఇడియట్’ కి సీక్వెల్ రూపొందించడానికి సిద్దపడుతున్నాడని వినికిడి. హిట్లు లేక సాయిరామ్ నిరాశలో ఉన్నాడని అందుకే తన తమ్ముడికో హిట్ సినిమా చేసి పెట్టాలని ఈ సీక్వెల్ కు మాటలు, స్ర్కీన్ ప్లే రెడీ చేస్తున్నాడని సమాచారం. దర్శకత్వం మాత్రం అతని దగ్గర వర్క్ చేస్తోన్న ఓ అసోసియేట్ తో చేయిస్తాడని సమాచారం. ఈ చిత్రానికి నట్టికుమార్ నిర్మాత వ్యహరించనున్నాడని సమాచారం.