ఇదో రకం దోపిడీ!

| No Comments | Labels : ,

చందాలు వసూలు చేసే దందాను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ మొదలుపెట్టారు. పార్టీ పెట్టినప్పటి నుంచి అవసరమైనప్పుడల్లా తనకు అలవాటైన ఫార్ములాను ఉపయోగిస్తున్న కేసీఆర్, ఈ సారీ అదే పని చేశారు. కూలీ పనంటూ చిన్న చితకా పనులు కొన్ని నిమిషాల పాటు చేసి లక్షలు అందుకోవడం ఆయనకు మాత్రమే తెలిసిన విద్య. వరంగల్ సభ నిర్వహణ పేరిట ఈసారీ అదే పనిలో పడ్డారు. హైదారాబాద్‌లోని ఉప్పల్‌తో మొదలై వరంగల్ వరకూ ఒక్కరోజులో ఆయన కూలీయాత్ర సాగింది. అన్నిచోట్లా భారీగానే డబ్బులు వసూలయ్యాయి గానీ, ఒక్క చోట మాత్రం మొండిచెయ్యి ఎదురయ్యింది. యాదగిరిగుట్టలో అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోవడంతో నిరాశ వెనుదిరిగారు కేసీఆర్. అయినా, తీసుకునేది పార్టీ విరాళం అయినప్పుడు ఇచ్చినంత తీసుకోవాలి గానీ, ముందుగానే ఇంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎక్కడైనా ఉంటుందా...? యాదగిరిగుట్టలోని ఓ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఇలానే 5 లక్షలు కావాలని, కేసీఆర్ కూలీపని చేయగానే ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారట. తీరా ఆయన చేసిన పనేమిటయ్యా అంటే, గౌడౌన్‌లోని తీగచుట్ట తెచ్చి ట్రాలీలో వేయడం. దీనికి 5 లక్షలు ఇచ్చుకోవాలా..? ఇదేమైనా న్యాయమా..! మనస్పూర్తిగా ఇచ్చింది తీసుకోవాలి గానీ, ఈ వసూళ్ల దందా ఏంది కేసీఆర్? దీనికి సంబంధించి ఈనాడు పత్రికలో వచ్చిన ఆర్టికల్ కింద ఉంది చదవండి.


కేసీఆర్‌ కూలీ వనికి దక్కని రూ.5 లక్షలు!

అసంతృవ్తితో పెనుదిరిగిన తెరాస అధినేత

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే : కూలి వనిచేసి వచ్చిన డబ్బును బహిరంగ సభకు కేటాయిరచాలనుకున్న కేసీఆర్‌కు నిరాశే ఎదురైరది. బుధవారం కూలీ పనిచేసి కూడా వేతనం గిట్టుబాటు కాలేదంటూ అసంతృప్తితో వెనుదిరిగారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో పనికి వచ్చిన కేసీఆర్ తొలుత జనరల్ మేనేజర్ కార్యాలయానికి వెళ్లారు. తర్వాత తెరాస రాష్ట్ర నాయకుడు కళ్లెం యాదగిరిరెడ్డి, పొలిట్‌బ్యూటరో సభ్యురాలు గొంగడి సునీతతో ఫ్యాక్టరీ గోదాంలోని తీగచుట్టను కేసీఆర్ స్వయంగా మోసుకొచ్చి ఆటోట్రాలీలో పేర్చారు. కూలిడబ్బు అడిగితే ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించకపోగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో కేసీఆర్ అసంతృప్తితో వెనుదిరిగారు. ఆయన కూలీపనికోసం వస్తున్నారన్న విషయాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యానికి నాలుగు రోజుల ముందే తెలిపామని తెరాస పొలిట్ బ్యూరో సభ్యురాలు గొంగడి సునీత చెప్పారు. కేసీఆర్‌కు రూ.5లక్షలు ఇవ్వాలని కోరామని, ఫ్యాక్టరీయాజమాన్యం మాత్రం ఏమీ చెప్పకుండా తాత్సారం చేసిందని చెప్పారు. తెరాస నేత కూలిగా రూ.5 లక్షలు చెల్లించాలని కోరిన విషయాన్ని ఫ్యాక్టరీ యాజమాన్య దృష్టికి తీసుకువెళ్లామని ఆ సంస్థ జనరల్ మేనేజర్ మణివణ్ణన్ తెలిపారు. యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పార్టీ నేతలు కోరిన మేరకు అందించలేకపోయామన్నారు. రూ.25వేలు మాత్రం ఇచ్చేందుకు సిద్ధం కాగా, పార్టీ శ్రేణులు తిరస్కరించాయన్నారు.

0 Responses to "ఇదో రకం దోపిడీ!"

Leave a Reply