సిద్దు నాకు డేట్స్ ఇవ్వట్లేదు..!?

| No Comments | Labels : ,

‘బొమ్మరిల్లు’ చిత్రం ద్వారా హీరో సిద్దార్థకు ఎంత క్రేజ్‌ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సిద్దార్థకు ఇంత మంచి సినిమా ఇచ్చిన దిల్‌ రాజు తాజాగా ఈ హీరోతో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ దిల్‌ రాజుకు సిద్దార్థ డేట్స్‌ కన్‌ఫార్మ్‌ చేయకుండా డైలమాలో పట్టాడని తెలుస్తోంది. దీంతో సిద్దార్థపై దిల్‌ రాజు చాలా కోపంగా ఉన్నాడట. తన బ్యానర్‌లో నిర్మించిన చిత్రం సిద్ధుకి ఎంతో క్రేజ్‌ తెచ్చిపెట్టి అతని కెరియర్‌ని ఓ మలుపు తిప్పితే, తనకు డేట్స్‌ ఇవ్వకుండా తలబిరుసుతనంతో సిద్ధు నడుచుకుంటున్నాడని దిల్‌ రాజు అతని సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట. ఇక సిద్దార్థ మాత్రం దిల్‌ రాజు చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా మరో చిత్రానికి సిద్ధు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం.

0 Responses to "సిద్దు నాకు డేట్స్ ఇవ్వట్లేదు..!?"

Leave a Reply